logo

KGF : భారీ సైన్యంతో బరిలోకి దిగుతున్న 'అధీరా' ..!


29-Jul-2019 15:25IST
kgf chapter 2 adheera first look release

కేజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతేడాది విడుదలైన కేజిఎఫ్ భారీ వసూళ్లను రాబట్టింది. ప్రశాంత్ టేకింగ్, ఎలివేషన్స్, యష్ నటన అన్ని కలిపి ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించాయి. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా కేజిఎఫ్ చాఫ్టర్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగం షూటింగ్ ని పూర్తీ చేసుకుంటున్న ఈ చిత్రంలో ఈసారి పెద్ద పెద్ద అంతులే నటిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమాలోని ప్రధాన ప్రతినాయకుడైన అధీరా పాత్ర లుక్ ని విడుదల చేసారు చిత్ర బృందం. కేజీఎఫ్‌లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించినా క్యారెక్టర్ చేసిన నటుడెవరో రివీల్ చేయలేదు. కాగా ఆ నటుడెవరో నేడు రివీల్ ఐపోయింది. ఆ పాత్ర చేసింది మరెవరో కాదు బాలీవుడ్‌ బడా హీరో సంజయ్‌దత్‌. నేడు సంజయ్ పుట్టిన రోజు ని పురస్కరించుకుని ఈ పోస్టర్ ని విడుదల చేసారు చిత్ర బృందం. 

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమా లో ఒక పాత్ర చేస్తున్నట్లు తెలిసినప్పటినుండి 'అధీరా'గా కనిపించేది ఆయనే అని ఊహాగానాలు వెలువడ్డాయి. ఊహించిన విధంగానే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కేజిఎఫ్2 లో 'అధీరా'గా నటిస్తున్నాడని ఈ పోస్టర్ తో అర్థమైపోయింది. వెనుక భారీ సైన్యంతో తలపాగాతో కూడిన ముసుగు ధరించిన సంజయ్ దత్ కిల్లర్ లుక్స్ లో భయంకరంగా ఉన్నాడు. మొదటి భాగంలో అధీరా కనిపించలేదు కానీ రెండవ భాగంలో ఈ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఆ పాత్ర కోసం సంజయ్ దత్ ని తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలో రాఖీ భాయ్ తో పోటీ పడి సంజూ ఎలా మెప్పిస్తాడో చూడాలి. 

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter 

Tags: kgf kgf chapter 2 adheera sanjay dutt

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top