logo

మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కన్నుమూత


29-Jul-2019 15:59IST
congress leader mukesh goud passes away

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్‌ గౌడ్‌.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారు. జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ గా కూడా పని చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్‌ గౌడ్‌.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 1989లో తొలిసారి మహారాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కూడా అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందారు. ముఖేష్ గౌడ్ గత ఏడు నెలల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు డాక్టర్లు పలు సర్జరీలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అంబులెన్స్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. ఆస్పత్రికి తరలించారు. ముఖేష్ గౌడ్ 1959, జులై 1వ తేదీన జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Tags: congress leader mukesh goud passes away

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top