logo

కారును ఢీకొట్టిన లారీ


29-Jul-2019 16:04IST
unnao rape survivors accident

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో ఓ టీనేజ్ యువ‌తిని స్థానిక బీజేపీ నేత కుల్దీప్ సెన‌గ‌ర్‌ రేప్ చేశాడు. ఆ కేసులో ఆ ఎమ్మెల్యే ప్ర‌స్తుతం జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్నాడు. కానీ రేప్ బాధితురాలు త‌న కుటుంబంతో క‌లిసి కారులో వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. ఓ లారీ వ‌చ్చి బాధితురాలి కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఇద్ద‌రు ఫ్యామిలీ మెంబ‌ర్స్ చ‌నిపోయారు. రాయ్‌బ‌రేలీలో జ‌రిగిన‌ ఆ ప్ర‌మాదంలో అత్యాచార‌ బాధిత టీనేజ్ అమ్మాయి తీవ్రంగా గాయ‌ప‌డింది. అయితే త‌మ కారును .. బీజేపీ నేత‌నే లారీతో ఢీకొట్టించాడ‌ని బాధితురాలి త‌ల్లి ఆరోపిస్తున్న‌ది. పోలీసులు మాత్రం ప్ర‌మాద‌వ‌శాత్తే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ బాధిత కుటుంబ‌స‌భ్యులు ఈ కేసులో సీబీఐ విచార‌ణ కోరుకుంటే.. దానికి ప్ర‌భుత్వం అంగీకరిస్తుంద‌ని డీజీపీ తెలిపారు. ఇవాళ ఉద‌యం రాజ్య‌స‌భ‌లో ఇదే అంశంపై వివాదం చెల‌రేగింది. రేప్ బాధితురాల‌ను చంపేందుకు ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి.

Tags: cbi unnao rape accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top