logo

ఇక పోరాడలేను ... నన్నుక్షమిస్తున్నారని ఆశిస్తున్నా : వీజీ సిద్దార్థ లేఖ


30-Jul-2019 12:06IST
cant fight anymore  hope you see me vg siddharthas letter

కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక పోలీసులు ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. సోమవారం వీజీ సిద్ధార్థ నది బ్రిడ్జి పైన కారు దిగి ఫోన్ మాట్లాడుతూ కాసేపు నడిచాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో డ్రైవర్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు. వీజీ సిద్ధార్థ మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు. విషయం తెలిసి ముఖ్యమంత్రి యడియూరప్ప, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇదిలా ఉండగా, వీజీ సిద్ధార్థ కేఫ్ కాఫీ డే (CCD) బోర్డుకు, ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అదృశ్యం కావడానికి ముందు ఈ లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖలో వీజీ సిద్దార్థ నేను చాలా కాలం పోరాడానని, కానీ ఏం చేయలేక వదిలేస్తున్నానని, షేర్ల బైబ్యాక్ విషయంలో ఓ ప్రయివేటు ఈక్విటీ పార్ట్‌నర్స్ ఒత్తిడిని తాను ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, ఓ స్నేహితుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నానని ఆ లేఖలో రాసాడు. ఈ నేపథ్యంలో కంపెనీ ఆస్తులు, అప్పుల వివరాల జాబితాను అందిస్తూ కంపెనీ కొత్త యాజమాన్యం నిర్వహణలో నడపాలని వీజీ సిద్ధార్థ బోర్డు డైరెక్టర్లకు సూచించారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశ్యం లేదని, కాఫీ డే కంపెనీ వ్యవస్థాపకుడిగా విఫలమయ్యానని, ఏదో ఒకరోజు మీరు నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నా అంటూ ఆయన లేఖలో పేరుకొన్నాడు.

Founder & owner, Cafe Coffee Day (CCD), 's letter to employees and board of directors of CCD, states, "Every financial transaction is my responsibility...the law should hold me & only me accountable."; He has gone missing from Mangaluru, search operation underway.

View image on Twitter

Tags: cafe coffee day founder vg siddhartha missing letter

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top