logo

కోతిని మింగిన కొముడొ డ్రాగన్ ...!


30-Jul-2019 15:21IST
komodo dragon eats live monkey

ప్రపంచంలోనే కొముడో డ్రాగన్స్ అతిపెద్ద బల్లుల జాతికి చెందినవి. వీటినే పల్లెటూర్లలో ఉడుములుగా పిలుస్తారు. అంతే కాకుండా ఇవి చూడడానికి అచ్చం రాక్షస బల్లుల్లా కనిపిస్థాయి. 3 మీటర్ల పొడవు నుంచి 70 కిలోల బరువు వరకు పెరుగుతాయి. సాధారణంగా పక్షులు, క్షీరదాలు, అకశేరుకాలను తిని ఉడుములు జీవిస్తుంటాయి. కొముడొ డ్రాగన్ లాలాజలంలో విషం ఉంటుందని అంటారు. అది కరిస్తే బతకడం కష్టమని అంటుంటారు. డ్రాగన్ కింది దవడలో నుంచి విషపూరితమైన లాలాజలం స్రవిస్తుంటుంది. అది తినే ఏ పక్షి జంతువైనా వెంటనే విష ప్రభావానికి గురై చనిపోవాల్సిందే. 

ఇటీవల కొముడొ డ్రాగన్ కు సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారీ కొముడొ డ్రాగన్.. అమాంతం ఓ బతికి ఉన్న కోతిని మింగేస్తున్నట్టుగా ఉంది. ఇండోనేషియాలో డైనొసర్ పరిమాణంలో భయానకంగా ఉన్న కొముడొ డ్రాగన్.. 10 అడుగుల పొడవు ఉంది. కోతిని నోటకరిచి ఎలా మింగేస్తుందో చూడండి.. వైరల్ అయ్యే వీడియోలో దాదాపు సగానికి పైగా ఏదో జంతువును ఉడుము మింగేసినట్టు కనిపిస్తోంది. చూడటానికి అది కోతిలానే కనిపిస్తోంది. భారీ సైజులో ఉన్న కొముడొ డ్రాగన్ ఇండోనేషియా ద్వీపాల్లోని రింకా, ఫ్లోర్స్, గిలి మాంటాంగ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 

ప్రపంచంలో భయంకరమైన ప్రిడేటర్లలో ఇదొకటి. సాధారణంగా ఇక్కడి కొముడొ డ్రాగన్స్.. జింక, పాములు, పందులను తిని జీవిస్తుంటాయి. గంటకు 15 మైళ్ల వేగంతో పరిగెత్తగలవు. ఉడుము సైజు పరిమాణంలో ఉన్న 80 శాతం జంతువులను వేటాడుతుంటాయి. ఉడుములోని లాలాజలంలో 50 రకాల బ్యాక్టీరియా ఉంటుందని చెబుతుంటారు. మనుషులకు కూడా వీటి నుంచి ప్రమాదం లేకపోలేదు. కొన్నిసార్లు మనుషులను సైతం వేటాడుతుంటాయి. ఇప్పటివరకూ డ్రాగన్స్ దాడిలో నలుగురు మృతిచెందినట్లు సమాచారం.

Tags: komodo dragon eats live monkey

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top