logo

మదురైలో రెచ్చిపోయిన విద్యార్థులు..బస్ కండెక్టర్‌పై దాడి


30-Jul-2019 17:40IST
students in madurai attacked by bus conductor

బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులను టిక్కెట్ తీసుసుకోమని అడిగినందుకు దానికి నిరాకరించి తమ దగ్గరున్న కత్తులతో బస్ కండెక్టర్‌పై దాడి చేసి తీవ్రంగా దాడి చేసిన ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది. గతంలో చెన్నై సిటీ బస్సులో కాలేజీ విద్యార్థులు పట్టపగలు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న ఘటనను మరువకముందే...మదురైలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నై తరహాలోనే మదురైలోనూ విద్యార్థులు రెచ్చిపోయారు.  ప్రభుత్వ బస్‌లో టిక్కెట్ తీసుకునేందుకు నిరాకరించిన ఇద్దరు విద్యార్థులు... కండెక్టర్‌పై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.

 మదురై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఇద్దరు ప్రైవేటు పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రభుత్వ బస్ ఎక్కి, టిక్కెట్ తీసుకునేందుకు నిరాకరించారు. టిక్కెట్ తీసుకోవాల్సిందేనని పట్టుబట్టిన కండెక్టర్‌తో వారు వాగ్వివాదానికి దిగారు. చివరకు తమ దగ్గర రహస్యంగా ఉంచుకున్న రెండు కత్తులతో కండెక్టర్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కండెక్టర్ గణేశన్‌ను రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి, పరారీలో ఉన్న ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

Tags: madurai students attacked bus conductor

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top