logo

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ ఆత్మహత్యా


31-Jul-2019 11:03IST
cafe coffee day founder vgsiddharth commits suicide

బెంగళూరు: కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్‌ కేసు విషాదాంతంగా ముగిసింది. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. సోమవారం రాత్రి నుండి అదృశ్యమైన సిద్దార్థ ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళూరు సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కనిపించకపోయేసరికి డ్రైవర్ ఇంటి సభ్యులకు సమాచారం అందించాడు. దీనితో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా వెతికారు. కానీ ఆయన ఆచూకీ తెలియలేదు. నేత్రావతి నదిలోకి దూకినట్లుగా ఓ మత్స్యకారుడు చూసినట్లు చెప్పడంతో.. పోలీసులు 25 బోట్లలో గజ ఈతగాళ్లతో గాలించగా చివరికి అతడి మృతదేహం లభ్యమయ్యింది. 

Tags: cafe coffee day vg.siddharth suicide

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top