logo

చత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్...జవాన్ మృతి


31-Jul-2019 11:17IST
IED blast in chhattisgarh  Jawans death

ఈ రోజు చత్తీస్‌గఢ్‌లో​ జరిగిన ఐఈడీ బ్లాస్ట్ లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. వివరాల్లోకి వెళితే...దంతెవాడలోని బొద్లి ప్రాంతంలో బుధవారం ఉదయం 6:15గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. దంతెవాడ-జగ్ధాల్‌పూర్‌ బోర్డర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ శిబిరానికి 700 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. జవాన్‌ మృతదేహాన్ని చత్తీస్‌గఢ్‌లోని బర్సుస్‌ ప్రాంతానికి తరలించారు. మృతిచెందిన జవాన్ బీహార్ కు చెందిన రోషన్ మార్‌గా గుర్తించారు. రోషన్‌ సీఆర్‌పీఎఫ్‌ 195వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు సమయాచారం.

Tags: IED blast chhattisgarh Jawan death

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top