logo

సన్నీలియోన్ కోసం ఫోన్ కాల్స్ తో వేధింపులు


31-Jul-2019 14:01IST
harassment with phone calls for sunnyleone

బాలీవుడ్‌ నటులు దిల్జీత్‌ దొసాన్జ్‌, వరుణ్‌ శర్మ, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరపైకి ఈ నెల 26న విడుదలైన అర్జున్‌ పటియాలా మూవీలో అతిధి పాత్రలో కన్పించిన సన్నీ ఈ సినిమాలో ఒక సీన్ కోసం చెప్పిన ఫోన్‌ నెంబర్‌.. నిజంగా  సన్నీ లియోన్ దే అనుకుని చాలా మంది ఆ నెంబర్‌కు తెగ ఫోన్లు చేస్తున్నారు. అయితే సన్నీ మూవీలో చెప్పిన ఫోన్‌ నెంబరును ఢిల్లీకి చెందిన పునీత్‌ అగర్వాల్‌ ఉపయోగిస్తున్నారు. నిజంగానే అది సన్నీ నెంబర్‌ అని భావించిన జనాలు పునీత్ కి కాల్స్ చేసి తెగ వేధిస్తున్నారంట. రోజుకు కనీసం 150 ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీడియో కాల్‌ చేయాలంటూ, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పునీత్‌ చెప్పారు. దాంతో నన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చిన  ‘అర్జున్‌ పటియాలా’ సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పారు.  

Tags: harassment phone calls sunnyleone

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top