logo

విజయవాడలో నక్షత్ర తాబేళ్ల పట్టివేత..!


31-Jul-2019 16:50IST
star tortoises being smuggled vijayawada navajivan expressone

విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న  రైల్వేస్టేషన్‌లో నక్షత్ర తాబేళ్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారుల అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే...సదరు వ్యక్తి  విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో 500 నక్షత్ర తాబేళ్లను ఓ సూట్ కేస్ లో తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం అందిందనీ..దీంతో  అటవీ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టగా ఓ ప్రయాణీకుడి సూట్ కేస్ లో 500 నక్షత్ర తాబేళ్లు పట్టుబడ్డాయని డీఆర్‌ఐ ఉన్నతాధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కదిరికి చెందిన వ్యక్తి వాటిని తనకిచ్చి అహ్మదాబాద్‌లో ఒకరికి అందజేయాలని సూచించినట్టు నిందితుడు తెలిపాడు. అహ్మదాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పట్టుబడిన నిందితుడిని కస్టమ్స్ చట్టం 1962 కింద అరెస్టు చేసిన డీఆర్‌ఐ అధికారులు..మిగిలిన నిందితులకు గాలింపు చర్యలు చేపట్టారు. 

Tags: star tortoises smuggling vijayawada arrested

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top