logo

'సీఎం'కు లేఖ రాసిన కాంగ్రెస్ నేతలు ..!


01-Aug-2019 11:19IST
congress leaders write letter to cm jagan

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ స్థానిక నేతల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందివ్వాలని చెబుతుంటే, నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

ప్రభుత్వం ప్రజలకు సేవలను అందించేందుకు ఏర్పాటు చేస్తున్న గ్రామ వాలంటీర్ల నియామకంలో జిల్లాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ పోస్ట్ కు సైతం కొందరు మూడవ స్థాయి నాయకులు దరఖాస్తు దారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags: congress leaders ap cm jagan ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top