logo

సిని నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు అరెస్టు వారెంట్


01-Aug-2019 14:28IST
arrest warrant issued on film producer bellamkonda suresh

సిని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తమకు ఇవ్వాల్సిన రూ. 3.5 కోట్లను తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని ఓ ఛానల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం జులై 31వ తేదీ బుధవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది.  2010లో యష్ రాజ్ ఫిలింస్ బాండ్ బాజా బారాత్ అనే సినిమాను నిర్మించింది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం సక్సెస్ అయ్యింది. 2013లో బెల్లంకొండ సురేష్ జబర్దస్త్ సినిమాను నిర్మించాడు. ఇందులో సిద్దార్థ్ హీరోగా..సమంత హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాపై యష్ రాజ్ ఫిలింస్ స్పందిస్తూ... ఇందులో తమ సినిమాలోని 19 సీన్లు కాపీ చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ...

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. డాఅన్తో ఈ సినిమా ప్రదర్శనను కోర్టు నిలిపివేసింది. ఏ నేపథ్యంలో జబర్దస్త్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే...టెలివిజన్ శాటిలైట్ టెలీకాస్ట్ రైట్స్.2ను రూ. 3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్‌కు విక్రయించారు. సినిమా ప్రదర్శించివద్దని..టెలివిజన్‌లోనూ టెలికాస్ట్ చేయ వద్దని కోర్టు సూచించింది  ఆ టీవీ ఛానెల్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని బెల్లంకొండ చెల్లించలేదు. రేపు..మాపు అంటూ టైం వెళ్లబుచ్చారు. చివరకు ఈ ఛానెల్ కోర్టు తలుపు తట్టింది. బెల్లంకొండ తీసుకున్న రూ. 3.5 కోట్లు ఇప్పుడు..రూ. 11.75 కోట్లకు చేరుకుంది. దీంతో కోర్టు అతనికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. 

Tags: arrest warrant film producer bellamkonda suresh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top