రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు న్యాయం జరగడంతో పాటు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. దశలవారీ మద్య నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టడం స్వాగతించాల్సిన విషయమన్నారు. నవరత్నాల అమలుపై సీఎం చిత్తశుద్దితో ఉన్నారని, గ్రామ సచివాలయాల వల్ల ఉద్యోగ భద్రత పెరుగుతుందని అన్నారు.