logo

'పృథ్వీ'పై నిప్పులు చెరిగిన పోసాని ..!


02-Aug-2019 11:31IST
posani murali krishna sensational comments on prudhivi raj

సినిమా వాళ్లకు జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యల్ని నటుడు వై.కా.పా. నాయకుడు పోసాని కృష్ణమురళి తప్పు బట్టారు. పృథ్వీ అలా అని ఉండకూడదు అని వ్యాఖ్యానించారు. జగన్ దగ్గరకు వెళ్లి ఆయనకు ఒక దండ వేసి అభినందిస్తేనే ఆయనపై ప్రేమ ఉన్నట్టు కాదని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నిర్మాత సురేష్ బాబు ఫోన్ చేసి జగన్ అపాయింట్‌మెంట్ కోసం అడిగారని అయితే ఆ విషయం పృథ్వీకి తెలియకపోవచ్చని తెలిపారు. 

ఈ విషయంలో పృథ్వీ తొందరపడి స్టేట్ మెంట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీ తరుపున పేపర్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అలాగే నామినేట్ పదవులపై తనకు ఆశలేదని, ఇప్పటి వరకూ తాను ఎవర్నీ ఏం అడుక్కోలేదు ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో కూడా పృథ్వీ, పోసాని మధ్య విభేదాలు ఉన్నాయన్న మాటలకు బలం చేకూర్చినట్టు అయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: posani murali krishna prudhivi raj ys jaga mohan reddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top