logo

దేవ‌దాస్ క‌న‌కాల కన్నుమూత‌


02-Aug-2019 17:26IST
rajiv kankala father devadas kanakala is no more

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు దేవ‌దాస్ క‌న‌కాల క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1945, జూలై 30 యానంలో జ‌న్మించిన దేవ‌దాస్ చ‌లిచీమ‌లు, నాగ‌మ‌ల్లి చిత్రాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేవ‌దాస్ కుమారుడు రాజీవ్ క‌న‌కాల కాగా, కుమార్తె శ్రీల‌క్ష్మీ. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ న‌డిపిన దేవ‌దాస్ క‌న‌కాల ఎంతో మందికి న‌ట‌నలో శిక్ష‌ణ ఇచ్చారు . ఓ సీత క‌థ‌, మాంగ‌ళ్యానికి మ‌రో ముడి, అమ్మో ఒక‌టో తారీఖు, మ‌ల్లీశ్వ‌రి, కింగ్, సిరిసిరి మువ్వ, మంచు ప‌ల్ల‌కి, గోరింటాకు, భ‌లే దంప‌తులు, గ్యాంగ్ లీడ‌ర్, శ్రీరామ్, పెద‌బాబు, ఒక్క మ‌గాడు, జోష్‌, నీ స్నేహం, మ‌న‌సంతా నువ్వే, చెట్టు కింద ప్లీడ‌ర్ త‌దిత‌ర చిత్రాల‌లో దేవ‌దాస్ న‌టించారు. చివ‌రిగా ఆయ‌న భ‌ర‌త్ అనే నేను చిత్రంలో నటించారు. అమృతం సీరియ‌ల్‌లో నటించి అల‌రించారు దేవ‌దాస్‌. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. 

Tags: Devadas Kanakala No More Tollywood

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top