logo

విద్యుత్ షాక్ తో రైతు మృతి


03-Aug-2019 10:24IST
farmer died because of current shock

విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లగా సోమాజీతండాకు చెందిన రైతు లావుడ్య మొతి రామ్ పొలానికి నీళ్లు పెట్టేందుకు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్ళాడు. కరెంటు మోటార్ లో విద్యుత్య సరఫరా ఆగిపోవడంతో మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు వచ్చి గమనించగా అప్పటికే  మొతిరాం మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. రైతు మృతితో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags: farmer died current shock

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top