logo

'అన్నకాంటీన్ల'ను మీ హెరిటేజ్ సొమ్ముతోనేమైన నడిపారా : విజయసాయి రెడ్డి


03-Aug-2019 19:05IST
vijaya sai reddy sensational twit on nara lokesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన 'అన్నకాంటీన్లు' తాత్కలికంగా మూతపడడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య పలుచోట్ల మాటల యుద్ధం నడుస్తుంది. అన్నకాంటీన్లు మూసివేయడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, వైసీపీ నేతలు వాటిని తిప్పికొడుతున్నారు. తాజాగా అన్నకాంటీన్లపై టీడీపీ నేతలతో పాటు మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. 

తాను ట్విట్టర్లో అన్నకాంటీన్లను మీ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ? మూసేశారని, టీఎంసీల కొద్ది కన్నీరు కారుస్తున్నావు', అని సూటిగా ప్రశ్నించాడు. అన్నకాంటీన్లకు కేటాయించిన నిధుల్లో రూ.43 కోట్లను పసుపు-కుంకుమకు మళ్లించారని, మీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా మీరు దోచుకున్నేదుకే మొదలుపెట్టారని, ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. అదేవిధంగా అన్నకాంటీన్లను మూసివేసే ఆలోచన మాకు లేదని, ప్రజలకు అనుకూలంగా ఉండేలా కాంటీన్ల ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
    

   https://twitter.com/VSReddy_MP/status/1157517869057372160

Tags: vijaya sai reddy nara lokesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top