logo

యువతిని వేధించారని యువకులపై దాడి .. వీడియో వైరల్


03-Aug-2019 19:06IST
3 men harassed young woman

ప్రకాశం జిల్లా జిల్లా సింగరాయకొండలో దారుణం చోటుచేసుకుంది. తమ బంధువుల యువతిని వేధించారనే కారణం తో  ఆరుగురు యువకులు కలిసి ముగ్గురు యువకులని తీవ్రంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు చాలా రోజుల నుండి వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో సదరు యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. ఆగ్రహానికి గురైన యువతి బంధువులు ఆ ముగ్గురు కుర్రవాళ్లను నమ్మించి బైకులో ఊరికి దూరంగా ఉన్న జామాయిల్‌ తోటల్లోకి తీసుకెళ్లారు.అక్కడ ముగ్గురు యువకులను  ఆరుగురు యువకులు విచక్షణ రహితంగా కొట్టడం ప్రారంభించారు. అనంతరం దాడిచేసిన దృశ్యాలను ఒకరు ఫోన్‌లో చిత్రీకరించి గ్రూపులో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసారు.

Tags:

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top