logo

చెన్నై విమానాశ్రయంలో రూ. 2.25 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం


04-Aug-2019 10:40IST
chennai airport costs Rs 225 crore worth diamonds seized

దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలను మలేషియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...మలేషియా నుంచి వచ్చిన అజ్మల్ ఖాన్ నాగూర్ మీరా (48) అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి వస్తువులు కనిపించకపోవడంతో బాడీ స్కాన్ చేశారు. దాంతో అసలు గుట్టు బయటపడింది. బాడీ స్కాన్‌లో అజ్మల్ లోదుస్తుల్లో ఓ సంచిని ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు అదేంటా అని పరిశీలించగా...అందులోని వజ్రాలను చూసి ఆశ్చర్యపోయారు. వాటి విలువ రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. 

అలాగే, అతడు  తనతోపాటు తీసుకొచ్చిన కుక్కర్‌ను పరిశీలించగా అందులోనూ వజ్రాలు కనిపించాయి. అజ్మల్ నుంచి మొత్తం రూ. 2.25 కోట్ల విలువైన 2996 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాటిని ఎవరి కోసం తీసుకొచ్చాడన్న దానిపై కూపీ లాగుతున్నారు. కాగా, అజ్మల్‌ కోసం ఎవరైనా వస్తారేమోనని పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. అతడిని విమానాశ్రయం బయట నిల్చోబెట్టి వజ్రాల కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూశారు. చాలాసేపు ఎదురుచూసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో అజ్మల్‌ను వెనక్కి తీసుకెళ్లారు.

Tags: chennai airport diamonds seized costs Rs. 2.25 crore

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top