logo

అనుమానం పెనుభూతమయ్యింది...!


05-Aug-2019 15:22IST
suspicion overcame

వికారాబాద్:  అనుమానం పెను భూతమైంది. కట్టుకున్న వాడే కాలయముడు అయ్యాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరామనగర్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో తన భార్య, పిల్లలను భర్త అతి దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం తెల్లజామున జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌,అదే ప్రాఅంతానికి చెందిన చాందినీని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆయాన్‌(10), కూతురు ఏంజిల్‌(5) ఉన్నారు. ప్రవీణ్‌ భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకోవడంతో.. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డారు. 

దాంతో ఆమెపై ద్వేషం పెంచుకున్న ప్రవీణ్ విచక్షణ కోల్పోయి అర్థరాత్రి దాటాక ఇనుప రాడ్డుతో భార్య, పిల్లల తలలపై బలంగా మోదాడు.  ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడనుంచి నేరుగా నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ నేరుగా వికారాబాద్‌ పోలసు ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించాడు. సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన అక్కడి ప్రాంతం వాళ్ళను షాక్ కు గురి చేసింది. అభంశుభం తెలియని పిల్లలని చూడకుండా ప్రవీణ్ అతి కిరాతకంగా చంపడం స్థానికులను కంటతడి పెట్టింది. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలను బలి చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పిల్లలు ఏం పాపం చేశారని వాళ్ళను చంపాడని కన్నీటి పర్యంతం అయ్యారు.

Tags: vikarabad wife and children killed

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top