logo

నీటి పాఠాలు నేర్పిన కోతి


05-Aug-2019 16:51IST
monkey to teach water lesson

కోతిలోంచి మనిషి పుట్టాడని మానవజీవన పరిణామ క్రమంలో చదువుకున్నాం. ఎవరైనా చిలిపి పనులు చేసినప్పుడు కోతి చేష్టలు ఆపుతావా అని తిడుతూ ఉంటారు. కోతి అంటే కాస్త దుందుడుకు పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి అలా అంటుంటారు. టెక్నాలజీలో డెవలప్ అయిపోతున్నామనీ గొప్పలు పోతున్నాం. కానీ కోతి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నిరూపించింది ఓ వానరం. దాహం వేసి మంచినీటి పంపు ఓపెన్ చేసిన నీరు తాగిన ఓ కోతి దాహం తీరాక ఆ ట్యాప్ ను చక్కగా బంద్ చేసి మరీవెళ్లింది. మనలో ఎంతమంది ఈ కోతిలా బాధ్యతగా చేస్తున్నాంమని ప్రశ్నించుకోకతప్పదు. నీళ్లు వృధాగా పోతున్న చాలామంది దాన్ని ఏమాత్రం పట్టించుకోరు. కనీసం ఈ కోతిని చూసిన తర్వాతైన ప్రతి ఒక్కరూ నీటి విలువ గురించి తెలుసుకోవాలి. 

ట్యాప్ ఓపెన్ చేసి దాహం తీరిన తరువాత ట్యాప్‌ను బంద్ చేసిన ఓ టిక్‌టాక్ వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది మనషులకు కనువిప్పు కలిగించే సందేశం అని ఆయన క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన దేశంలో వేసవికాలంలో నీటి కష్టాల గురించి చెప్పనక్కరలేదు. వేరే రాష్ట్రాల నుంచి కూడా నీరు తెచ్చుకోవాల్సిన వచ్చిన దుర్భర పరిస్థితుల గురించి విన్నాం..కళ్లారా చూశాం. తాగునీటి కోసం పోరాటాలు జరుగుతున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. కానీ నీటిని సంరక్షించుకోవాలి..పొదుపు చేసుకోవాలి..పద్ధతిగా వాడుకోవాలని మాత్రం మనుషులకు తెలియటంలేదు. వాడేది కొంతఅయితే దుర్వినియోగం చేసేందో ఎంతో. ట్యాప్‌లను ఓపెన్ చేస్తాం..కానీ పూర్తిగా కట్టం..అలా చుక్కా చుక్కా..నీరు కారుతూ వేస్ట్ అయిపోతుంది.కానీ ఓ కోతిమాత్రం ఓ ట్యాప్‌ వద్ద నీరు తాగి చక్కగా దాన్ని బంద్ చేసింది. 

Tags: monkey closed tap drinking water

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top