logo

ఆర్టికల్ 370 పై స్పందించిన సీపీఐ నేత రామకృష్ణ


06-Aug-2019 11:17IST
cpi leader ramakrishna responded to article 370

దేశవ్యాప్తంగా ఉత్కంఠతను రేకిత్తించిన ఆర్టికల్ 370 బిల్లు రద్దుపై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తనదేన శైలిలో స్పందించారు. కడప లో సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌పై బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. 

కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ ప్రజలలో ఉద్రిక్తత, అభద్రతా భావం నెలకొని అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ నాయకులను నిర్భందించి దేశ విభజన సమయంలో పెద్దమనుషులు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 పై ప్రజాభిప్రాయం సేకరించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. 

Tags: cpi leader ramakrishna article 370 jammu and kashmir

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top