logo

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నా ఓవైసీ


06-Aug-2019 17:51IST
owaisi opposes the repeal of Article 370

ఇవాళ(ఆగస్టు-6,2019) లోక్ సభలో జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అంతే కాకుండా ఇది ఖచ్చితంగా బీజేపీ వారి మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జీవించింది. కానీ రాజ్యాంగ విధులకు అనుగుణంగా జీవించలేదు. రాజ్యాంగ వాగ్దానాన్ని బీజేపీ ఉల్లంఘించింది. సోమవారం ఈద్ పండుగ. ఈద్‌ రోజు ఏమి జరుగుతుంది?  గొర్రెపిల్లను బలి ఇవ్వడానికి బదులగా కాశ్మీరీలు వాళ్లకు వాళ్లే బలి తీసుకోవాలని అనుకుంటున్నారా? బీజేపీ వాళ్లు అలా చేస్తున్నారని ఆయన అన్నారు. ఆర్టికల్ 370రద్దను తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. శ్రీనగర్ ను బీజేపీ వెస్ట్ బ్యాంక్ గా మార్చిందన్నారు. బీజేపీ 'నాజీలు' సూచించిన వ్యూహాలను ఉపయోగిస్తోందన్నారు.

Tags: owaisi opposes article 370 narendra modi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top