logo

విద్యార్థి ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్


08-Aug-2019 14:42IST
student suicide about cricket betting

క్రికెట్ బెట్టింగ్ వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది. క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్టు ఓ విద్యార్ధి సూసైడ్ నోట్‌ రాసి ఆత్మహత్యా చేసుకున్న ఘటన  హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన విష్ణుమూర్తి-వినోద దంపతులకు కుమార్తె, కుమారుడు రవికుమార్ (21) ఉన్నారు. 25ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోరబండలో నివాసం ఉంటున్నారు. రవికుమార్ కూకట్‌పల్లిలోని ప్రతిభ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ విద్యార్థులే లక్ష్యంగా కెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రవికుమార్ అతడి వలలో చిక్కాడు. రూ.40 వేల వరకు బెట్టింగ్ డబ్బు బాకీపడ్డాడు.

ఆ డబ్బు కోసం రాజశేఖర్ ఒత్తిడి తెచ్చాడు. చివరికి ఇంటికి వచ్చి బెదిరించాడు. దీంతో రవికుమార్ తండ్రి విష్ణుమూర్తి చేసేది ఏమి లేక తన పొలం అమ్మి రూ.40వేలు కట్టాడు. కానీ ఇంకా రూ.40 వేలు ఇవ్వాలని రాజశేఖర్ మళ్ళీ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. డబ్బు కోసం టార్చర్ పెట్టాడు. కొన్నాళ్లకు వేధింపులు పెరిగడంతో మనస్తాపానికి గురైన రవి తన వల్లే కుటుంబానికి ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన చెందాడు. ఇంట్లోని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు రాజశేఖర్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Tags: student suicide cricket betting hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top