logo

జైల్లో డ్రగ్స్ మాఫియా డాన్ ఆత్మహత్య..!


08-Aug-2019 16:02IST
drug mafia don suicide in jail

జైలు నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసి దొరికిపోయి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రెజిల్ డ్రగ్ డాన్‌గా పాపులర్ అయిన క్లావినో డ శిల్వ(42) జైలులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చాలా తెలివిగా కూతురు మాస్క్ వేసుకుని పోలీసులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. అందుకు ఎన్ని కష్టాలు పడినా చివరికి దొరికిపోయాడు. పోలీసులు  అనుమానంతో విచారించగా... అసలు నిజం తెలిసింది.  వివరాల్లోకి వెళితే... బ్రెజిల్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ డ్రగ్స్ మాఫియా కేసులో ద శిల్వ(43) అనే వ్యక్తికి 73ఏళ్ల జైలు శిక్ష విధించింది బ్రెజిల్ కోర్టు. శిక్షానుసారం జైలులో ఖైదీగా ఉన్నాడు. పథకం ప్రకారం.. రెండ్రోజుల క్రితం అతణ్ని చూసేందుకు వచ్చిన 19ఏళ్ల కూతురి వేషంలో పారిపోవాలనుకున్నాడు. 

అతన్ని చూసేందుకు తన కూతురితో పాటు కుటుంబ సభ్యులు జైలుకు వచ్చారు.  అయితే తన కూతురి ముఖంలా ఉన్న ఓ సిలికాన్ మాస్క్, టీ షర్ట్, ప్యాంట్ తెప్పించుకున్నాడు. ఇక విజిటింగ్ అవర్స్ ముగిసిన తర్వాత ముఖానికి ఆ మాస్క్ ధరించి అచ్చం అతని కూతురి లాగే తయారయ్యాడు. పింక్ టీ షర్ట్, ప్యాంట్‌తో పాటు అమ్మాయిలా కనపడేందుకు లోదుస్తులు ధరించి గేట్ వద్దకు వచ్చాడు. పోలీసులకు కాస్త అనుమనంతో విచారణ జరపగా ఖైదీ మారువేషంలో ఉన్నాడని గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఒకొక్కటిగా దుస్తులు, మాస్క్ తీసేసి నేరం చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఈ ఘటన అనంతరం చేసేదేమి లేక మనస్తాపానికి గురైన శిల్వ ఆత్మహత్యా చేసుకున్నాడు.

Tags: drug mafia don suicide jail

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top