logo

చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం..!


09-Aug-2019 07:57IST
road accident at chennai

తమిళనాడు జాతీయ రహదారి నెత్తురోడింది. తెల్లవారు జామున రోడ్డు పై రక్తపు మరకలతో ఉన్న మృత దేహాలను చూసి స్థానికులు బయాందోళనికి గురయ్యారు. వివరాలలోకి వెళితే తమిళనాడులో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పుదుకోటై- తిరుచ్చి రహదారిలో నార్తామలై  రైల్వే పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Tags: road accident chennai

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top