logo

వాలంటీర్ ఉద్యోగం ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం


09-Aug-2019 08:35IST
disabled women suicide attempt because of volunteer job

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో గ్రామా వాలంటీర్ల పోస్టులను ప్రకటించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున ఏపీలోని గ్రామీణ ప్రాంతాలలో లక్షా తొంబై వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అయితే ఇంటర్వ్యూ సమయంలో అవకతవకలు జరుగుతున్నట్లుగా పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఉద్యోగాల కేటాయింపులో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించినప్పటికీ స్థానిక నాయకులూ, ప్రభుత్వం చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి తమకు అనుకూలమైన వారికీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఉద్యోగం పై పుల్లమ్మ అనే వికలాంగురాలు ఆశలు పెట్టుకుంది. తీరా చూస్తే స్థానిక నాయకులూ వారికీ అనుకూలమైన వారికి వాలంటీర్ ఉద్యోగం ఇప్పించుకున్నారు. దింతో ఉద్యోగం ఆశించి భంగపడ్డ ఒక వికలాంగురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఈ ఘటన కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల మండలం బెలం గ్రామంలో జరిగింది. పుల్లమ్మ అనే వికలాంగురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గ్రామపెద్దలు జ్యోక్యంతో తనకు రావలసిన ఉయోగాన్ని వేరొకరికి ఇచ్చారని మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. అయితే దీనిని గమనించిన స్థానికులు ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: disabled women suicide attempt volunteer job

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top