logo

విజయవాడలో పెట్టుబడుల సదస్సు ప్రారంభించనున్న వై ఎస్ జగన్


09-Aug-2019 09:14IST
ys jagan to inaugurate investment seminar in vijayawada

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకుని విజయవాడలో నేడు పెట్టుబడుల సదస్సు ప్రారంభం అవ్వనుంది . హోటల్‌ గేట్‌వేలో ఈ రోజు  ఉదయం 10గంటలకు  సీఎం జగన్ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిథులకు వివరించనున్నారు. 

భారత విదేశాంగ శాఖ సమన్వయంతో ఈ సదస్సు జరగనుండగా..35దేశాల నుంచి 40మంది రాయబారులు, కాన్సులేట్ జనరల్స్ హాజరుకానున్నారు. ముఖ్యంగా కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలెండ్, బల్గేరియా, బంగ్లాదేశ్, బ్రిటన్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, అంగోలా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు విచ్చేయనున్నారు. పెట్టుబడుల సదస్సు సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయి..వివిధ దేశాల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. ఇక కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Tags: ys jagan inaugurate investment seminar vijayawada

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top