logo

శనగ పిండి ని ఇలా వాడితే అందం మీ సొంతం..


09-Aug-2019 10:46IST
gram flour beauty tips

శనగ పిండిని వంటలలో మాత్రమే ఒకప్పుడు వాడేవారు . కానీ ,ఈ శనగ పిండి చర్మాన్ని మృదువుగా మార్చుతుండడంతో దీనిని ప్రతి ఒక్క బ్యూటీ ప్రొడక్టులలో వాడుతున్నారు. అలాంటి శనగ పిండిని ఉపయోగించి మనము ఇంట్లోనే కూర్చొని అందాన్ని ఎలా మెరుగు పర్చుకోవచ్చొ ఇప్పుడు చూద్దాము..

శనగ పిండి , పసుపు :

Image result for gram flour with turmeric

శనగ పిండిని ఒక స్పూన్ తీసుకోని , అందులో చిటికెడు పసుపు వేసుకొని , పేస్ ప్యాక్ వేసుకోవడానికి వీలుగా ఉన్నన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి , మెడకు రాసుకొని ఒక పదిహేను నిమషాలయ్యాక కడిగేసుకోవాలి. అందమైన , మృదువైన చర్మం మీ సొంతం..

శనగ పిండి , పెరుగు :

Image result for gram flour with curd

పెరుగు చర్మానికి  మృదుత్వాన్ని కలిగించడమే కాకుండా మృత కణాలను కూడా తొలగించి చర్మానికి రంగును కలిగిస్తుంది. ఒక స్పూన్ శనగ పిండికి , అరస్పూన్ పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముఖానికి , మెడకు రాసుకొని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

శనగ పిండి , టమోటా :

Image result for gram flour with tomato

శనగ పిండిని ఒక స్పూన్ తీసుకోని , అందులో సరిపడా టమోటా గుజ్జును కలుపుకొని , ఆ రెండు బాగా కలిసేదాకా కలుపుకొని చర్మం ఎక్కడ బ్లాక్ గా అయ్యినట్లు అనిపిస్తుందో అక్కడా మాసాజ్ లాగ చేసుకోవాలి. అలా ఐదు నిముషాలు అయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు కనుక చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం.

శనగ పిండి , రోజ్ వాటర్ , చక్కర :

Image result for gram flour with rose water

ఒక స్పూన్ శనగ పిండిని తీసుకోని , కొద్దిగా చక్కర వేసుకొని , ఒకటినర్ర స్పూన్ రోజ్ వాటర్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించుకోవాలి . రెండు నిమిషాలు అయ్యాక నెమ్మదిగా స్రబ్ చేసుకొని చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.

శనగ పిండి , గంధం , తేనే:

Image result for gram flour with sandal wood

ఒక స్పూన్ శనగ పిండి ,అర స్పూన్ గంధం తీసుకోని , రెండు కలిసేంత తేనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి , మెడకు రాసుకొని పది నిముషాలు అయ్యాక కడిగేసుకోవాలి. అంతే మెత్తని , అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చూసారుగా ఎంతో ఈజీగా వేసుకొనే శనగ పిండితో పేస్ ప్యాక్స్ .. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి ..

Tags: gram flours beauty tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top