logo

యువతులను విక్రయిస్తున్న దళారులు


09-Aug-2019 11:01IST
mediums selling young womencooperating police

ఆదివాసీ యువతులే లక్ష్యంగా చేసుకొని మంచి ఉపాధి చూపిస్తామని నమ్మించి వారిని వేరే రాష్ట్రాలకు విక్రయిస్తున్న దళారులు. ప్రభుత్వ  యంత్రాంగం, అధికారులు ఎంత అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా, ఆదివాసీ యువతుల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొమురం భీం జిల్లాకు చెందిన ఓ యువతిని రాజస్థాన్ కు చెందిన వ్యక్తికి విక్రయించిన దళారులు, వారికి సాయం చేసిన పొలిసు. వివరాల్లోకెళితే... ఇద్దరు దళారులు ఉపాధిని చూపిస్తామని, మంచి వ్యక్తితో వివాహం జరిపిస్తామని కుమురం భీమ్ జిల్లా తిర్యాణి మండలానికి చెందిన ఓ యువతిని, ఆమె కుటుంబాన్ని నమ్మించారు. అనంతరం ఆమెను అక్కడి నుండి తీసుకొని వెళ్లి ఓ పొలిసు సహాయంతో రాజస్థాన్ కు చెందిన వ్యక్తికి అమ్మేయగా, అక్కడి నుండి ఎంతో కష్టంగా తప్పించుకున్న ఆ యువతీ తన కుటుంబీకులకు ఫోన్‌ లో విషయం చెప్పి బావురుమంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో, జిల్లా ఎస్పీ మల్లారెడ్డి స్పందించారు. ఆమెను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో పాటు ఈ దందాలో హస్తం ఉన్న ఓ పోలీస్‌ ను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags: police rajasthan women trafficking

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top