logo

కేరళలో భారీ వర్షాల కారణంగా 14మంది మృతి


09-Aug-2019 11:40IST
14 people killed due to heavy rains in Kerala

గత కొద్ది రోజుల నుండి కేరళలో భారీ వర్షాల కారణంగా వరదలతో మునిగిపోయింది. ఈ భారీ వర్షాల కారణంగా ఎంతో ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ గురువారం ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోగాఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్లు సమాచారం. దాంతో 22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 315 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం అదనంగా మరో 13 యూనిట్ల ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆర్మీని కోరారు. వరద బీభత్సంతో వణికిపోతున్న వయనాడ్‌ను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. కాగా, వయనాడ్‌లో గురువారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 40 మంది చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా ఈ నెల 14 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 

Tags: Kerala 14 people die heavy rains

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top