logo

మొబైల్ దొంగతనం చేశాడని ఓ యువకుడిపై దాడి


09-Aug-2019 13:11IST
Attack on a young man accused of mobile theft

మొబైల్ దొంగతనం చేశాడన్న  చిన్న కారణంతో ఓ యువకుడిని చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టి హింసించిన ఈ అమానుష ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...హరిద్వార్‌లోని స్థానిక హజారా గ్రాంట్ అనే గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన మొబైల్ ఫోన్‌ను జుల్ఫాన్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ దొంగలించాడనే అనుమానంతో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి తన స్నేహితులతో కలిసి  చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి ముగ్గురు కర్రలతో తీవ్రంగా కొట్టి హింసించారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డవారు ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించినట్టు పోలీసులు తెలిపారు. గత వారంలో కూడా ఓ  మతి స్థిమితం లేని వ్యక్తిని ఇలాగే తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే.

Tags: attacked young man accused mobile theft

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top