logo

చెన్నై ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్


09-Aug-2019 15:24IST
chennai  airport with bomb threat call

చెన్నై ఎయిర్ పోర్టుకు గుర్తు తెలియని ఓ వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చెయ్యడంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడే ఉన్న బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించడంతో ఎవరినీ లోనికి, బయటకు వెళ్లేందుకు అనుమతినించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తెలిసిన వివరాల ప్రకారం..సౌదీ అరేబియాకు బయలుదేరిన చెన్నై విమానంలో ఓ మహిళా ప్రయాణీకురాలు భారీ మందుగుండు సామాగ్రీతో బయలుదేరిందని..ఢిల్లీ విమానాశ్రయ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చింది. 

చెన్నై ఎయిర్ పోర్టుకు వెంటనే సమాచారం అందించారు. ఎయిర్ పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూర్టీ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూర్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం దృష్ట్యా, జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల  ఆయా ఎయిర్ పోర్టుల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.  బాంబు బెదిరింపు కాల్ తో విమానాశ్రయం లోపల, బయట విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పార్కింగ్ స్థలంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాంబు అని ఫోన్ చేసిన వ్యక్తి తమిళనాడు సేలం జిల్లా నివాసి అని తెలుస్తోందని..సరిహద్దుల్లో పెట్రోలింగ్ టీం సోదాలు చేస్తోందని అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు కనీసం రెండు గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచనాలు జారీ చేశారు. 

Tags: chennai airport bomb threat call

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top