logo

బాలుడి అదృశ్యం కథ సుఖాంతం


09-Aug-2019 18:05IST
the story of the boys disappearance is a happy ending

తూర్పుగోదావరి: జిల్లాలోని ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలుడు తోట ధనుష్‌ అదృశ్యం కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రవరం గ్రామానికి చెందిన ధనుష్‌ఏలేశ్వరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరోతరగతి  చదువుతున్నాడు. స్వగ్రామం నుంచి ఏలేశ్వరం పాఠశాలకు ఆర్టీసీబస్సులో రాకపోకలు సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన బాలుడు.. సాయంత్రం ఇంటికి చేరుకోలేదు. అర్ధరాత్రి వరకు కుమారుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులకు ఏలేశ్వరం డిగ్రీ కళాశాల సమీపంలో స్వల్ప గాయాలతో పడివున్న బాలుడు ధనుస్సును గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్సై కె.సుధాకర్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: missing boy disappearance happy ending

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top