logo

యూపీ యోధా‌పై సునాయాసంగా నెగ్గిన పట్నాపైరేట్స్


10-Aug-2019 10:54IST
patna pirates easy victory over up yodha

రైడర్ పర్దీర్ నర్వాల్ రాణించడంతో,తాజా సీజన్లో పట్నాపైరేట్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనపరిచింది. భారీ అంచనాల మధ్య ఈ సీజన్లో బరిలోకి దిగిన పట్నాపైరేట్స్ పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ముందుండలేకపోయింది. టోర్నీలో తొలిసారి పూర్తి స్థాయి ప్రదర్శనతో బలహీనమైన ప్రత్యర్థి యూపీ యోధా‌పై  41-20 తేడాతో నెగ్గింది. స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 12 పాయింట్లతో చెలరేగడడంతో పట్నా జట్టు సునాయాసంగా నెగ్గింది. 

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో పట్నా పైరేట్స్ పుంజుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అంచనాల్ని అందుకోలేకపోతున్న ఆ జట్టు ఈరోజు యూపీ యోధాతో జరిగిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. పర్దీప్‌తో పాటు డిఫెండర్ నీరజ్ కుమార్ కూడా 8 పాయింట్లతో సత్తాచాటాడు. దీంతో మ్యాచ్‌లో పట్నాకి తిరుగులేకుండా పోయింది. సగం టైమ్ ముగిసేలోపే  పట్నాకి భారీ ఆధిక్యం లభించింది. సగం టైమ్ ముగిసే సమయానికి 24-9 తేడాతో యూపీ యోధాఫై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆఖరి సగంలో యూపీ యోధా రైడర్ మోను, డిఫెండర్ సుమిత్ ఆ జట్టుని గెలిపించేందుకు విఫలయత్నం చేసారు.పట్నా పైరేట్స్ జట్టుగా రాణించడంతో యూపీ యోధా చిత్తయింది. 

టోర్నీలో ఆరో మ్యాచ్‌ ఆడిన యూపీ యోధాకి ఇది మూడో పరాజయంకాగా.. ఏడో మ్యాచ్ ఆడిన పట్నా పైరేట్స్‌కి ఇది మూడో గెలుపు. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం దబాంగ్ ఢిల్లీ 21 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత జైపూర్ పింక్ పాంథర్స్ (20), బెంగళూరు బుల్స్ (20), యు ముంబా (18) టాప్-4లో కొనసాగుతున్నాయి. 

Tags: patna pirates victory up yodha

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top