logo

కుప్ప కూలిన మూడంస్తుల భవనం: నలుగురి మృతి


10-Aug-2019 14:09IST
three floor building collapsed four dead

అర్ధరాత్రి మూడంస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు మృతి చెందిన దుర్ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్‌లోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం నుండి మరో ఐదుగురుని సురక్షితంగా బయటకి వెలికి తీశారు. అంతే కాకుండా శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా గుజరాత్ ని పీడిస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. గోద్రాలోని రైల్వే ప్లాట్‌ఫారం పూర్తిగా నీట మునిగింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 

Tags: three floor building collapsed four dead gujarath

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top