logo

రూ.20 లక్షలను దారి మరల్చేందుకే బ్లేడుతో కోసుకున్నాడు


10-Aug-2019 15:05IST
Rs 20 Lakhs to redirect blushed with the blade

విశాఖపట్నం: ఈ నేల 7న విశాఖ పోర్టు రోడ్డులో జరిగిన దారి దోపిడీ కేసుని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన భాదితుడు నివాసరావును ఈ కేసులో నిందితుడిగా పోలీసులు తేల్చారు. వివరాల్లోకెళితే.. ఓ ప్రైవేటు ట్రాన్స్ పోర్టు కంపెనీలో పని చేస్తున్న నిందితుడు సంస్థ సొమ్మును అపహరించేందుకు నాటకం ఆడాడని విచారణలో వెల్లడైనట్లు నగర పోలీస్‌ కమిషనర్ ఆర్‌కే మీనా తెలిపారు. అతడు పన్నిన పథకం ప్రకారం రూ.20 లక్షలను దారి మళ్లించి ఎవరో దోపిడీ చేసినట్లుగా శ్రీనివాసరావు చిత్రీకరించడానికి ప్రయత్నించాడని ఆయన వివరించారు.

దృష్టి మరల్చేందుకు తానే స్వయంగా బ్లేడుతో దాడి చేసుకున్నాడని చెప్పారు. ఎట్టకేలకు కేసుని  ఛేదించిన పోలీసులు మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌కే మీనా మాట్లాడుతూ.. ట్రాన్స్ పోర్టు, పెట్రోల్ బంకులు తదితర కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల వివరాలను యజమానులు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. పెద్ద మొత్తంలో సొమ్మును నేరుగా ఉద్యోగులతో రవాణా చేయిస్తే నేరాలు జరిగే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా దోపిడీ ఘటనలు జరిగినట్లయితే వెంటనే ఫిర్యాదు చేస్తే కేసును ఛేదించడం సులభమవుతుందని పేర్కొన్నారు. 

Tags: Rs. 20 Lakhs police chased robbery case

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top