logo

దేశం మొత్తం సాహో ఫీవర్


10-Aug-2019 16:27IST
saaho trailer release

బాహుబలి సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు రాజమౌళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందగా, అదే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ , టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం వల్ల దీనికి సంబందించిన ప్రతి అంశం కూడా వైరల్ అవుతుంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్, షేడ్స్ అఫ్ సాహో వంటి వీడియోలకు బాగా ఆదరణ లభించింది. 

అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రానికి సంబందించిన ట్రైలర్ విడుదల కానుంది. దీనికి కోసం దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుస్తుంది. అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇదే విషయం ట్రేండింగ్ గా నిలుస్తుంది. ట్విట్టర్ లో కూడా ఈరోజు ఉదయం నుండి మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ ట్రైలెర్ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్య నగరాల్లోని థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. 

ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహమ్మద్ జిబ్రాన్, తనిష్క్ బాఘ్చి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం అన్ని నాన్-బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా విడుదల ఉందని హీరో నాని తన సినిమా గ్యాంగ్ లీడర్ విడుదలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter 

Tags: prabhash saaho saaho official trailer

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top