logo

సాహో ట్రైలర్ రివ్యూ


10-Aug-2019 17:42IST
saaho trailer review

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్న సాహో ట్రైలర్ వచ్చేసింది. రీసెంట్ గా ముంబైలో 2000 కోట్ల రాబరీ జరిగింది అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  సినిమాలో ప్రభాస్ ఒక అండర్ కవర్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శ్రద్దా కపూర్ అమృత నాయర్ క్రైమ్ బ్రాంచ్ లో పని చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.సినిమాకు సంబందించిన టెక్నికల్ అంశాలను పక్కకి పెడితే ఇందులో ప్రభాస్ కనిపిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫీల్ గుడ్ సినిమాకు ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటి వాడు సర్, కంటెంట్ కరెక్ట్ గా ఉన్నా, విజువల్ చాలా డిస్టర్బ్ గా ఉంటుందని మురళి శర్మ చెప్పిన తరువాత వచ్చే ప్రభాస్ షాట్ ట్రైలర్ కే హైలైట్ గా నిలుస్తుంది.  

సినిమాలో కంప్లీట్ యాక్షన్ తో పాటు కామెడీ, రొమాన్స్ కూడా ఉన్నాయ్. సినిమాలో శ్రద్దా కపూర్ పాత్రకు కూడా బాగానే ప్రాముఖ్యత ఉన్నట్టు కనిపిస్తుంది. విలన్ గా నటిస్తున్ననీల్ నితీన్ పాత్రకు యాక్టర్ సత్యదేవ్ చెప్పిన డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వించనున్నారు. దాదాపు సినిమాలోని ప్రతి పాత్రను కూడా ట్రైలర్ లో చూపించారు.  

ట్రైలర్ లో కనిపించిన ప్రతి విజువల్ కూడా హాలీవుడ్ మూవీని తలపించేలా ఉన్నాయ్. ట్రైలర్ ఎండింగ్ లో ప్రభాస్ పై వర్షంలా రక్తం పడుతుండటం ట్రైలర్ కే హైలైట్ గా నిలుస్తుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా దేశంలోని అని భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

"సొంత ఇండస్ట్రీలో ఏ హీరో అయిన హిట్ కొడతాడు కానీ ప్యాన్ ఇండియా లెవెల్ ల్లో హిట్ కొట్టే వాడికే ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ ఉన్న హీరోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస.
Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter 

Tags: saaho prabhash shraddha kapoor sujith

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top