logo

మగవారి వారికోసం బ్యూటీ టిప్స్ ...


11-Aug-2019 07:22IST
mens beauty tips

మగవాళ్ళు బయట ఎప్పుడూ ఎక్కువగా తిరుగుతుంటారు.. దానితో చర్మం గరుకుగాను ట్యాన్ పడుతుంది..అందుకోసం వాళ్ళు కూడా అమ్మాయిలకన్నా ఎక్కువగా పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి వారికోసం ఇంట్లో దొరికే వాటితో సింపుల్గా ఎలా తిరిగి వాళ్ళ చర్మ రంగును పొందవచునో చూద్దాము..

తేనే , నిమ్మరసం , చక్కర ఫ్యాక్ :

Image result for honey lemons sugar
ముందుగా ముఖాన్ని చల్లని నీటితో కడిగి టవల్తో శుభ్రంగా తుడుచుకొని, ఒక కప్లో ఒక స్పూన్ చక్కర , అరస్పూన్ తేనే , కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకొని, ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకొని చల్లని నీళ్లతో  కడిగేనుకుంటే చాలు ఎంతో అందమైన ముఖం మీ సొంతమవుతుంది..

టమోటా , చక్కర ఫ్యాక్ :

Image result for tomato with sugar scrub
టమోటా చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది , చక్కర చర్మాన్ని స్రబ్ చేస్తుంది..మునుగా ఒక టమోటాను తీసుకొని దానిని సగానికి కట్ చేసుకొని , కొద్దిగా చక్కెరను టమోటాపై వేసుకొని పేస్ , మెడపై నెమ్మదిగా గుండ్రంగా రుద్దుతూ ఉండాలి.. ఇలా 5 నుంచి 7  నిమిషాలు కనుక చేసుకొని చల్లని వాటర్ తో కనుక కడిగేసుకుంటే పేస్ పై ట్యాన్ పొయ్యి పేస్ అందంగా మారుతుంది..

బియ్యపు పిండి , టమోటా , నిమ్మరం :

Image result for rice flour , tomato

చర్మానికి బియ్యపు పిండి స్రబ్ చేయడమే కాకుండా చర్మం పై ఉన్న ముడుతలను పోగొట్టడంలో సహాయపడుతుంది. టమోటా గురించి లాస్ట్ టైం మీకు చెప్పను . ఇకపోతే నిమ్మరసం చర్మ రక్షణకు దోహద పడుతుంది. ముందుగా ఒక స్పూన్ బియ్యపు పిండి తీసుకొని , అర స్పూన్ టమోటా గుజును కలిపి , కొద్దిగా నిమ్మరం కలిపి ముఖానికి , మెడకు రాసుకొని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం నిగ నిగలాడుతుంది.

శనగపిండి , పెరుగు ,బియ్యపు పిండి :

Image result for rice flour , gram flour, curd

శనగ పిండి చర్మానికి స్రబ్ చేస్తుంది , పెరుగు మృదుత్వాన్ని కలిగిస్తుంది , ముడుతలను తొలగిస్తుంది. శనగ పిండి , బియ్యపు పిండి రెండు ఒక ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి . ఆ రెండూ కలిసేలా పెరుగును కలుపుకోవాలి . ఇక ముఖాన్ని వాటర్తో కడిగి ముఖానికి రాసుకొని , పదహైదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలా అందమైన చర్మం మీ సొంతం.

అలోవెరా మసాజ్ :

Image result for aloe vera

అలోవెరా న్యాచురల్ తెరపి.. చర్మాన్ని నీటితో శుభ్రం చేసుకున్నాక ఈ అలోవెరా జెల్ , లేదా అలోవెరాను తీసుకొని పేస్ కి అప్ల్యా చేసుకొని కొద్దిసేపయ్యాక కడిగేసుకుంటే చాలు ట్యాన్ తొలగిపోతుంది..

చూసారుగా ఈ ఈజీ టిప్స్.. మీరు కూడా ట్రై చేసి మీ అందాన్ని మెరుగు పరుచుకోండి..

Tags: mens beauty tips easy tips home made beauty for mens

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top