logo

అరబిందో ఫార్మాలో పేలిన బాయిలర్


11-Aug-2019 12:09IST
explosive boiler in aurobindo pharma

బాయిలర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పైడిభీమవరంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం..మొదటి షిప్ట్‌లోని  కార్మికులు పనిలో ఉండగా హట్టాతుగా బాయిలర్ పేలుడు సంభవించింది. దాంతో అక్కడ కంపెనీలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో రాహుల్‌, రాజారావు అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే తమ ప్రాణాలను కోల్పోగా, సన్యాసిరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారం మేరకు స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: srikaakulam arabindo pharma explosive

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top