logo

ఉత్తరప్రదేశ్ లో కన్ను కోల్పోయిన వ్యాపారి... కారణం ఇదేనా..?


11-Aug-2019 13:14IST
the trader who lost his eyein uttarpradesh

పది రూపాయల మొక్కజొన్న కోసం ఓ వ్యక్తి, వ్యాపారి కళ్ళు పీకేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మావూ జిల్లాల్లో కోపగంజ్ లో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం...కోపాగంజ్ ప్రాంతంలోని దోస్తపురా పోలీస్ స్టేషన్ సమీపంలో రామ్ విలాస్ సోంకర్ మొక్కజొన్న పొత్తులు అమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో అభిమన్యు అనే వ్యక్తి మొక్కజొన్న దుకాణదారుడు రామ్ విలాస్ దగ్గరికీ వచ్చి మొక్కజొన్న కావాలని అడగడంతో రామ్ విలాస్ పొత్తు ఇచ్చి రూ.20లు ఇవ్వమని అడిగాడు. 20 నోటు ఇచ్చిన అభిమన్యు రూ.15 తీసుకుని ఐదు రూపాయలు ఇచ్చేమని అడిగాడు. దానికి రామ్ కుదరదు నేను రూ.20కే అమ్ముతున్నాను ఐదు రూపాయలు ఇవ్వడం కుదరదు అనడంతో అభిమన్యు వాగ్వాదానికి దిగాడు. 

వారిద్దరి మధ్య మాటా.మాటా పెరగడంతో అభిమన్యు నా ఐదు రూపాయలు ఎందుకు ఇవ్వవో చూస్తానంటు అక్కడే ఉన్న ఇనుప కడ్డీతో రామ్ విలాస్ కంటిపై కొట్టడంతో ఒక కన్ను గుడ్డు బయటకి వచ్చింది. దీంతో తీవ్ర రక్త స్రావంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు రామ్ విలాస్ ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రామ్ విలాస్ భార్య స్థానిక పొలిసు ఠానాలో పిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అభిమన్యు కోసం గాలిస్తున్నారు. కాగా రామ్ విలాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం వారణాసి ఆస్పత్రికి తరలించారు. 



Tags: eye damage corn seller uttarpradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top