అందంలో అతిలోక సుందరి , ఎటువంటి క్యారక్టర్లోనైనా ఇమిడి పోయి చేయడం ఆమె నైజం. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ నటి కరీనా కపూర్. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న కూడా తన కొడుకు తల్లి ప్రేమను అందించడంలో ఎక్కడా వెనకడుగు వెయ్యదని చెప్పాలి. కరీనా డ్యాన్స్ రియాల్టీ షో అయిన " డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ " షూట్ కి వెల్తూ కాస్త సమయం దొరికితే, తన కొడుకుతో వీడియో కాల్ మాట్లాడుతూ వెళ్ళింది. ఆమె అలా కాల్ మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తల్లి కరీనాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆమె తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న తీరు అభినందనీయం, ఓ గొప్ప నటి.. అదేవిధంగా పర్ఫెక్ట్ మదర్, గ్రేట్..' అంటూ తెగ కామెంట్లు చేశారు.
మొన్నామధ్య ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కరీనా , తన తల్లి మాటలను గుర్తు చేసుకుంది. తన తల్లి తన కోసం ఎలా ఎదురు చూసిందో ఇప్పుడు తనకు కొడుకు పుట్టాక అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు నా కొడుకు విషయంలో నేను అలానే భయపడుతున్న అని కరీనా అన్నారు. అప్పట్లో టెక్నాలజీ సరిగ్గా లేదు. ఇప్పుడు ఉన్న కూడా తైమూర్ ప్లే స్కూల్ నుండి లేటుగా వస్తే నేను కాగారుపడుతూనే ఉంటాను అని కరీనా చెప్పుకొచ్చింది. దీన్ని ఎంతటి పెద్ద స్టార్లైనా కన్నా పేగుకు ఒగ్గాల్సిందే అని ఆమె మరో సారి నిరూపించింది.