logo

గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు


11-Aug-2019 13:36IST
good news  petrol and diesel prices down slightly

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం పెట్రోల్ ధర 10 పైసలు, డీజిల్ ధర 16 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.50కు, డీజిల్ ధర రూ.71.37కు తగ్గింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అదే విధంగా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.76.24కు చేరింది. డీజిల్‌ ధర 16 పైసలు క్షీణతతో రూ.70.76కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.75.87కు క్షీణించింది. డీజిల్ ధర 16 పైసలు క్షీణతతో రూ.70.42కు తగ్గింది.  

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.71.99కు దిగొచ్చింది. డీజిల్ ధర కూడా 15 పైసలు తగ్గుదలతో రూ.65.49కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 9 పైసలు క్షీణతతో రూ.77.65కు తగ్గింది. డీజిల్ ధర 16 పైసలు తగ్గుదలతో రూ.68.66కు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 2 శాతం పెరుగుదలతో 58.53 డాలర్లకు పెరిగింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 3.73 శాతం పెరుగుదలతో 54.50 డాలర్లకు చేరింది. 

Tags: petrol and diesel prices down slightly

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top