logo

టీడీపీని వీడేది లేదన్న గంటా


11-Aug-2019 14:54IST
ganta srinivasa rao reveals he is not quitting tdp

వైసీపీ ప్రభంజనంలో సైతం తన విజయాల పరంపరను కొనసాగించిన టీడీపీ కీలక నేత, ఓటమెరుగని నేత గంటా శ్రీనివాసరావు. ఏకపక్ష తీర్పులో సైతం 2019 ఎన్నికల్లో గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో గంటా పార్టీని వీడి బీజేపీ లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది వరకే చాల సార్లు ఈ వ్యవహారంపై స్పందించినప్పటికీ గంటాపై పుకార్లు మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో అయన మరోసారి అనుచరులు, కార్యకర్తలు, నేతలతో సమావేశమై సైకిల్ దిగేది లేదని క్లారిటీ ఇచ్చేశారు. తనపై నమ్మకంతో ఓటేసిన కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయన అన్నారు. 

బలవంతమైన కాపు సామాజిక వర్గ నేతల్లో ఒకరైన గంటా గనక బీజేపీ తీర్థం పుచ్చుకుంటే, ఆయన్ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దానిని ఆయన ఖండించారు. తానంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా పుకార్లు పుట్టిస్తున్నారని విచారం వ్యక్తం చేసారు. తన ఫై అవాస్తవాల్ని ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కొందరు నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని.. పార్టీలోనే కొనసాగుతానని గంటా తేల్చిచెప్పారు. పలు మార్లు వివరణ ఇచ్చుకోవాల్సి రావడంపై ఆయన స్పందిస్తూ .. ఓట్లేసి గెలిపించిన కార్యకర్తలు ఆందోళన చెందకూడదనే ఉద్దేశంతో ఇలా చెయ్యాల్సి వస్తుందని ఆయన ఆవేదన  వ్యక్తం చేసారు. నిజంగా తాను పార్టీ మారాల్సి వస్తే కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానని  గంటా తెలిపారు.
 

Tags: ganta srinivasa rao not quitting tdp

Advertisement
Advertisement
Top