logo

జైల్లో ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య


11-Aug-2019 15:59IST
a famous merchant suicide in jail

న్యూయార్క్‌: జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ జెఫ్రీ ఎప్‌స్టీన్ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్న ఘటన జైల్లో కలకలం రేపింది. వివరాల్లోకెళితే...జెఫ్రీ ఎప్‌స్టీన్ ‌అనే వ్యాపారి గతంలో బాలికల విక్రయం, వేధింపులు హత్యాయత్నం వంటి ఆరోపణలతో మన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటన్‌ కరెక్షనల్‌ జైలులో ఉన్నాడు. ముఖ్యంగా మైనర్ బాలికలను విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేశారు. ఎప్‌స్టీన్‌ గతంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్, బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ వంటి పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు సాగించేవాడు. మన్‌హట్టన్, పామ్‌బీచ్‌లలోని తన నివాసాల్లో 2002–2005 మధ్య టీనేజీ బాలికలను వాడుకోవడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అతనిపై విచారణ జరుగుతోంది. ఆరోపణలు రుజువైతే 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముండేది కానీ అంతలోపే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

Tags: a merchant suicide jail newyork

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top