logo

విజయవాడలో దారుణం... భార్య తల నరికిన భర్త


11-Aug-2019 17:51IST
a brutal crime in vijayawadahusband cut his wife neck

అతికిరాతకంగా తన భార్య తల నరికి ఆ తలను పక్కనే ఉన్న కాల్వలో పడేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్వయంగా లొంగిపోయిన ఘటన సత్యనారాయణపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తికి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. గత కొద్దీ రోజులుగా వారివురి మధ్య వివాదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. భార్యభర్తలిద్దరూ చట్టబద్ధంగా విడిపోవాలని అనుకున్నారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. అయితే వీరి కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. త్వరలోనే కేసు విచారణ ముగియనుంది. 

ఇంతలోనే భార్యపై పగ పెంచుకున్న ప్రదీప్ ఎలాగైనా సరే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. దాంతో అదే గ్రామంలో ఉంటున్న తన భార్య దగ్గరికి వెళ్ళి కత్తితో అత్యంత కిరాతకంగా తలను, మొండాన్ని వేరు చేసాడు. అనంతరం తలను పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. దాంతో రోడ్డుపై ఉన్న జనాలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టడం,కేకలు వేయడంతో తలను బుడమేరు కాలువలో పడేశాడు. అక్కడి నుంచి నుడుచుకుంటూ వెళ్లి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కిరాతకాన్ని చూసిన మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రదీప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: a brutal crime vijayawada husband cut his wife neck

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top