logo

మోదీ-అమిత్ షాలను పొగడ్తలతో ముంచేసిన రజినీకాంత్


11-Aug-2019 18:02IST
rajinikanth praises modi and amith shah

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన లిజినింగ్.. లెర్నింగ్.. లీడింగ్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రజినీకాంత్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన రజినీకాంత్  మిషన్ కాశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ కి, హోమ్ మినిస్టర్ అమిత్ షా లకు శుభాకాంక్షలు తెలియజేసి, వీళ్లిద్దరు కృష్ణుడు-అర్జునుడు లాంటి వారని పొగడ్తలతో ముంచెత్తారు. పార్లమెంట్ లో అమిత్ షా ప్రసంగం అద్భుతమని వ్యాఖ్యానించారు. 

ఇంకా వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ" ఆయన ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తారని, ఆయనో గొప్ప ఆధ్యాత్మికవేత్త" అని కొనియాడారు. వెంకయ్య నాయుడు గారి ఆలోచనల లోతు తెలియాలంటే అందరు ఈ పుస్తకం చదవాలని రజిని తెలియజేశారు. ఈ పుస్తకాన్నీ వెంకయ్య నాయుడు తన సొంత అనుభవాల ఆధారంగా రాశారు. 

Tags: rajinikanth modi amith shah venkaiah naidu

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top