logo

వాట్ యాన్ ఐడియా: కారునే హెలీకాఫ్టర్ గా మార్చేశాడు


11-Aug-2019 18:33IST
what an Idea he converted the car into a helicopter

బీహార్ లోని ఛాప్రా ప్రాంతానికి చెందిన మితిలేశ్ ప్రసాద్  పైప్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. మిథిలేష్ కి చిన్నప్పటినుండి హెలికాఫ్టర్ అంటే పిచ్చి. ఆ  మక్కువతోనే అతనే ఒక హెలికాఫ్టర్ తయారు చెయ్యాలన్న కోరిక పుట్టింది. కానీ దానికి సరిపడా డబ్బులేదు. కానీ ఎలాగైనా చేయాలని పట్టుదలతో ఉన్నాడు. నిరంతరం అదే ధ్యాస. అప్పుడే తనకి కారునే హెలికాఫ్టర్ లాగ తయారు చెయ్యాలనే ఓ ఆలోచన తట్టింది అంతే తన దగ్గర ఉన్న tat నానో కారును హెలికాఫ్టర్ గా మార్చేశాడు.మితిలేశ్ కి చిన్నప్పటి నుండే టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం. దాంతో హెలికాఫ్టర్ రూపొందించాలని కలలు కనేవాడు. దానికి తగిన టాలెంట్ కూడా ఉంది. టాలెంట్ ఉంటే సరిపోదు దానికి తగిన డబ్బు కూడా కావాలి..

హెలికాఫ్టర్ తయారు చేసేందుకు కావాల్సిన పరికరాలు కొనడానికి మితిలేశ్డ దగ్గర డబ్బు లేదు. అప్పడే అతనికి ఓ ఐడియా వచ్చింది. అందుబాటులో ఉన్న నానో కారుకు హెలికాఫ్టర్‌కు ఉండే తోక, పైన చక్రం తగిలించాడు.నానో కారునే హెలికాఫ్టర్ లుక్ లోకి మార్చిపడేశాడు. దానికి రంగురంగుల ఎల్ఈడీ లైట్స్ ఫిట్ చేశాడు. నానో కారు హెలికాప్టర్ గా తయారుచేయటానికి  ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. నిజమైన హెలీకాఫ్టర్ ను తయారు చేయటానికి తన వద్ద డబ్బు లేకపోయినా..కారునే హెలికాఫ్టర్ గా మార్చిన తృప్తి ఉందనీ..హెలికాఫ్టర్ కారులో ప్రయాణిస్తుంటే హెలికాఫ్టర్‌లో తిరిగిన ఫీలింగ్ కలుగుతోందంటు మితిలేశ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.

Tags: tat nano car helicopter bhihar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top