logo

జంతువులను కూడా తీనే మొక్కలున్నాయట..


12-Aug-2019 10:14IST
dangerous plants on earth

చెట్లు చేమలు అనేవి పచ్చదనానికి నిదర్శకాలు. అవి మానవాళికి ప్రాణవాయువును అందిస్తాయి అన్న సంగతి తెలిసిందే.ఎన్నో మూగ జీవులకు ప్రాణదానం కూడా.ఇలాంటి  ఈ చెట్లల్లో కోన్ని భయంకరమైన చెట్లు కూడా ఉన్నాయట.పచ్చని చెట్లు ఆరోగ్యానికి మెట్లు అని మన పూర్వికులు నిర్థారించారు. కానీ, మాంసాహారాన్ని తీసుకొనే భయంకరమైన చెట్ల గురించి ఎక్కడ చెప్పలేదు.కానీ, కొన్ని రకాల అడవుల్లో ఈ చెట్లు ఉన్నాయట..ఆ చెట్లు ఏంటి , ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూసి తెలుసుకుందాము..చూడాటానికి చాలా అందంగా ఉండి, ప్రమాదాలు తెచ్చే చెట్లు చాలానే ఉన్నాయి. అవెలాగంటే చాలా నిశబ్దన్గా ఉండి ఒక్కసారిగా ఏదైనా కీటకాలు వచ్చి వాటి మీద వాలితే ఇంకా అంతే వాటి జీవితకాలం అయిపోయినట్లే..అలా చాలా మొక్కలు భూమీద ఉన్నాయి.ఏ  ప్రాంతాల్లో వీటి పెరుగుదల ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము..

శారా సీనియా :

ఈ మొక్కలు చూడటానికి తెరుచుకున్న డబ్బా లెక్క ఉంటుంది.ఈ మొక్కలు ఎక్కువగా నార్త్ , సౌత్ అమెరికాలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి  చూడటానికి చాలా అందంగా ఉంటాయి ..అంతే ప్రమాదంగా కూడా ఉంటాయి.తెలియకుండా ఒక పురుగు దాని లోపలి వెళితే ఇంకా అది మల్లి పైకి రాదు. ఆ మొక్క ఆకులో ఒక ద్రవం రిలీజ్ అవుతుంది. లోపలి వెళ్లిన ఏదైనా పురుగు ఇంకా చనిపోవాల్సిందే..ఈ మొక్కకు ఆహారం అవ్వాల్సిందే.

నెపెంతస్ :
 
ఇవి కూడా మొక్కలే.. ఇవి చూడటానికి ఎదో సంచులు చెట్లకు కట్టినట్లు ఉంటాయి. కొంచం లోపలి చుస్తే ఒక ద్రవం అందులో ఉంటుంది. ఈ మొక్కలు కూడా మొదట చెప్పిన మొక్కలుగానే ఉండి ఏదైనా పురుగులు లేదా చిన్న జీవులు ఇందులోకి వెలితే ..అవి లోపలి నుండి పైకి రాలేవట. కొంత పెద్ద జంతువు అయిన వానరం లేక ఏ ఇతర జంతువైనా కూడా ఆ మొక్కలో కాలు  పెడితే అవి వాటి కాలును బయటకు తీసుకోవాలంటే చాలా కష్టపడతాయట..అంత ప్రమాదకరంగా ఉంటాయట ఆ సెపేంతస్ మొక్కలు.ఇవి  చైనా , మలేసియా , ఇండోనేషియా వంటి ప్రాంతాలల్లో దర్శనమిస్తూ ఉంటాయి.

జెన్లీసియా :

ఈ మొక్కల ఉనికి ఎక్కువగా ఆఫ్రికాలొనీ ప్రాంతాలలో గాని ,సౌత్ అమెరికాలో గాని సముద్రపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ మొక్కలు నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎక్కువ ఉన్నాయట.ఇక ఈ మొక్కలు చూడటానికి గడ్డి మొక్కలులా ఉండి, పైకి అందమైన పువ్వులను కలిగి ఉంటాయి.ఈ మొక్కలపై సన్నని బొచ్చులాగా ఉంటాయి. అది వాటిపై పడే పురుగులను లోపలి లాగేసుకుంటాయి. నీటిలో కూడా ఎక్కవగా ఉండే ఈ మొక్కలపై మనం ఎప్పుడైనా పొరపాటుగా కాలు వేస్తె వాటి పట్టును వదిలించుకోవడం చాలా కష్టమట. ఎప్పుడైనా ఆ ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్త సుమీ..

డార్లింగ్ టోనియా :

సినిమా పెరు లాగ  ఉన్న ఈ మొక్కలు ,కేవలం పేరుకే అందమైనవి . పేరులో ఉన్నంత స్వీట్గా ఈ మొక్కలు ఉండవు.ఇవి చాలా ప్రమాఫ్దకరమైన మొక్కలు.ఈ మొక్కలు నార్తర్న్ కాలిఫోర్నియా వంటి ప్రాంతాలలో ఎక్కువగా దర్శనమిస్తాయట.ఈ మొక్కలు చూడటానికి పడగ విప్పిన పాములాగా ఉంటుంది. ఏదైనా పురుగులు వస్తే వెంటనే లోపలి పడేలా చేసి, తరువాత స్వాహా చేస్తాయట.అది కూడా ఎలాగంటే పురుగు పైకి వస్తే వెంటనే అర సెకను కూడా ఆలోచించకుండా మింగేస్తుందని చెప్పాలి . అంత డేంజర్ మొక్కలు ఏవి.

రోసరా :

ఈ రోసరా మొక్కలు చూడాటానికి అందంగాను ,మరియు ఎదో వింతను తలపించేలా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా యూరప్ లో కనిపిస్తాయి. దీనికి మరో పేరు కూడా ఉందంట. అదే సంజూ..ఆ పేరు ఎలా వచ్చిందంటే..సన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటి పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చిందంట. ఇకపోతే వీటి నుండి వచ్చే పవ్వులు చాలా అందంగా ఉంటాయి.ఇక ఈ పూల నుండి ఒక జిగట పదార్ధం కూడా వెలువడుతుంది.ఆ పూలపై పురుగులు కనుక పడితే ఇక , ఆ పువ్వులో ఉండిపోతాయట.అలా ఆ పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. 
 

చూసారుగా మొక్కలు చుస్తే ఎంత అందంగా ఉంటాయో..అంతే ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి. పొరపాటున కూడా ఆ  మొక్క ఏంటో తెలియకుంటే కనుక వాటిని ముట్టుకోకండి. ఆ తరువాత బాధపడాలి.దీన్ని బట్టి   అందంగా ఉన్న ప్రతీతి మంచిది కాదు.. బె కేర్ ఫుల్..

Tags: dangerous plants animals eaten plants forest plants

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top